![]() |
![]() |
.webp)
బుల్లితెర ధారావాహికల్లో స్టార్ మా సీరియల్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వాటిల్లో బ్రహ్మముడి, కార్తీకదీపం-2, గుండె నిండా గుడిగంటలు, ఇంటింటి రామాయణం టాప్-5 లో ఉండగా.. కొత్తగా వచ్చిన ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ కూడా ట్రెండింగ్ లో ఉంటుంది.
ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ లో సీతాకాంత్-రామలక్ష్మీ జోడికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. స్టార్ మా టీవీలోని సీరియల్స్ అన్ని ప్రోమోలతో పోలిస్తే ఈ సీరియల్ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ లో టాప్-50 లో కొనసాగుతుంది. మరి అంతగా ఝ సీరియల్ లో ఏం ఉందంటే... గత జన్మలో సీతని చాటుగా చూసి రామ ప్రేమిస్తాడు. ఆ విషయం సీతకి తెలిసి తనకి కూడా ఇష్టమేనని చెప్తుంది. ఇంట్లో చెప్పకుండా సీత లేచిపోయి వస్తుంది. స్నేహితుడి సహాయంతో సీతని రామ పెళ్లిచేసుకుంటాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటామనే టైమ్ లో పెళ్లి ఇష్టం లేని సీత వాళ్ళ అన్నయ్య పరువు మర్యాదలే ముఖ్యమని భావించి రామని చంపేస్తాడు. ఆ దిగులుతో సీత కూడా చనిపోతుంది. ఈ జన్మలో మనల్ని విడదీసినా మన ప్రేమ వచ్చే జన్మలో కూడా ఉంటుందని గత జన్మకీ సంబంధించిన పాత్రలను ముగించారు డైరెక్టర్. ఇక ఈ జన్మకి సంబంధించిన పరిచయంలో.. గత జన్మలో రామగా చనిపోయి ఈ జన్మలో సీతాకాంత్ గా, సీతేమో రామలక్ష్మిగా పుడతారు. సీతాకాంత్ పుట్టిన ఇరవై సంవత్సరాలకి రామలక్ష్మి జన్మిస్తుంది. రామలక్ష్మి సివిల్ సర్వీస్ కోచింగ్ తీసుకుంటుంది. దాంతో పాటుగా క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. రామలక్ష్మికి ఒక తమ్ముడు, చెల్లెలు ఉండగా.. తమ్ముడు కాలేజీ, చెల్లలు స్కూల్ చదువుతుంటారు. ఇక తల్లి వంటింటికి పరిమితం.. ఎప్పుడు జాతకాలంటు టీవీ చూస్తు వాటినే ఫాలో అవుతుండే ఓ సాధారాణ గృహిణి. మాణిక్యం ఎత్తులకి పైఎత్తులు వేస్తుంటాడు.
ఈ సీరియల్ లో సీతాకాంత్ ని పెంచిన అమ్మ శ్రీలత. తనని బాగా నమ్ముతున్న సీతాకాంత్ కి తెలియకుండా సందీప్ కి ఆస్తి దక్కాలని శ్రీలత కపటనాటకం ఆడుతుంటుంది. అది తెలుసుకున్న రామలక్ష్మి.. సందీప్, శ్రీలత, శ్రీవల్లిల అంతు చూడాలని చూస్తుంటుంది. అయితే సీతాకాంత్ కి బ్యాక్ గ్రౌండ్ లో సవతి తల్లి శ్రీలత చేసే కుట్రలు తెలియక ఆమెని నమ్ముతాడు. మరి సీతాకాంత్ కి రామలక్ష్మిపై ప్రేమ కలిగేలా, అమ్మ శ్రీలత కపటనాటకం తెలిసేలా చేస్తుందా లేదా అనేది తెలియాలంటే ఈ సీరియల్ చూడాల్సిందే. ఎటో వెళ్ళిపోయింది మనసు కొత్త సీరియల్ అయినప్పటికీ టాప్ సీరియల్స్ తో పోటీ పడుతుంది.
![]() |
![]() |